
అత్యాధునిక సబ్ మెరైన్లను నిర్మించేందుకు భారత్ సన్నద్ధమైంది. భారతీయ నేవీ కోసం ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు రక్షణశాఖ సుమారు రూ. 43000 కోట్లు కేటాయించింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో సబ్ మెరైన్ల ప్రాజెక్టుకు ఆమోదం దక్కింది. స్వదేశీయంగా సబ్ మెరైన్లను నిర్మించేందుకు త్వరలోనే ప్రతిపాదనలను జారీ చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది.