
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ కీలక పదవి కట్టబెట్టారు. శనివారం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో ఈయనకు కీలక పదవి లభించింది. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా సిద్ధార్థ్ ను జగన్ సర్కార్ నియమించింది. కాగా 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు.