
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం అయ్యారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోన్న నర్సింహులును టీ టీడీపి అధ్యక్షుడిగా చంద్రబాబు ఖరారు చేశారు. 1994 లో షాద్ నగర్ ఎమ్మెల్యేగా బక్కని నర్సింహులు.. కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి శంకర్ రావు పై గెలుపొందారు. ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీ అయిన విషయం తెలిసిందే.