శృంగారం చేయకుండా ఈ ప్లాన్ చేశారు

జపాన్ లో ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒకరి నుంచి ఒకరు సామాజిక దూరం ఉండాలని ఆటగాళ్లకు కఠిన నిబంధనలు పెట్టారు. అయితే దాదాపు నెలరోజులు జరిగే ఈ వేడుకకోసం వచ్చిన క్రీడాకారులు శృంగారం కోసం ఏకమయ్యే చాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. అలా ఏకమైతే కరోనా వ్యాపించడం ఖాయం. అందుకే క్రీడాకారులు, క్రీడాకారిణులు శృంగారంతో ఎంజాయ్ చేసి కరోనా అంటించకుండా జపాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వారిని సపరేట్ […]

Written By: NARESH, Updated On : July 19, 2021 11:07 am
Follow us on

జపాన్ లో ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒకరి నుంచి ఒకరు సామాజిక దూరం ఉండాలని ఆటగాళ్లకు కఠిన నిబంధనలు పెట్టారు. అయితే దాదాపు నెలరోజులు జరిగే ఈ వేడుకకోసం వచ్చిన క్రీడాకారులు శృంగారం కోసం ఏకమయ్యే చాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. అలా ఏకమైతే కరోనా వ్యాపించడం ఖాయం.

అందుకే క్రీడాకారులు, క్రీడాకారిణులు శృంగారంతో ఎంజాయ్ చేసి కరోనా అంటించకుండా జపాన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వారిని సపరేట్ రూముల్లో వసతి కేటాయించకుండా ఓపెన్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ లో అందరూ పడుకునే ఏర్పాట్లు చేసి షాకిచ్చింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒకరితో ఒకరు కలవకుండా.. శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను సిద్ధం చేశారు. క్రీడా గ్రామంలోని అథ్లెట్ల గదుల్లో అట్టలతో తయారు చేసిన మంచాలను వేశారు. దీని కెపాసిటీ కేవలం 200 కేజీలు మాత్రమే. అంటే ఒకరు పడుకుంటే ఏం కాదు.. శృంగారం చేసుకోవడానికి ఇద్దరు పడుకుంటే టప్ మని కూలిపోతుంది. అలా జపాన్ ప్రభుత్వం వేసిన ఈ కన్నింగ్ ఐడియా ఆటగాళ్ల శృంగారానికి శరాఘాతంగా మారింది. క్రీడాకారులు భౌతిక దూరం పాటించాలన్న ఉద్దేశంతోనే ఇలా కాగితపు అట్టలను తయారు చేయించి పెట్టారట.. మొత్తానికి ఆటగాళ్లను కేవలం ఆటను మాత్రమే ఆస్వాదించాలని.. శృంగారాన్ని వద్దని జపాన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందట..