
తెలంగాణ పబ్లిక్ కమిషన్ కి 4 వారాల్లో చైర్మన్, సభ్యులను నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరుద్యోగి జె. శంకర్ వేసిన పిల్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. పబ్లిక్ కమిషన్ లో ఒక్కరు మాత్రమే ఉండడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీని క్లోజ్ చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. తెలంగాణ పబ్లిక్ కమిషన్ చాలా ముఖ్యమైనదని చైర్మన్ సభ్యులను నియమించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.