ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాజభవన్ నుంచే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ గా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉందన్నారు. వైరస్ బారిన పడి మరణించినవారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరోనాతో ఆర్థిక రంగంపై మరోసారి ప్రభావం పడిందని అయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని చెప్పారు.