
ఏపీ బీజేపీ కోర్ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం లో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి వాటిపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బీవీఎల్ నరసింహారావు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీ నారాయణ, సత్యకుమార్, ఆలిండియా సంఘటన సహ కార్యదర్శి శివ ప్రకాశ్ లు పాల్గొంటున్నారు.