https://oktelugu.com/

Anushka : కమ్ బ్యాక్ అంటున్న అనుష్క.. ఈసారి మామూలుగా ఉండదట..

అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈ అమ్మడు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మందికి ఫేవరేట్ హీరోయిన్ గా మారింది. ఒకప్పుడు ఏ సినిమా వచ్చినా అందులో అనుష్క ఉండేది. కొత్త సినిమా వస్తుందే అనుష్కదేనా అనే రేంజ్ లో సినిమాలు వచ్చాయి. స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ బ్యూటీ. కానీ కొన్ని సంవత్సరాలు ఎందుకో సైలెంట్ అయిపోయింది. కానీ ప్రస్తుతం ఇన్నేళ్లూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అంటుంది. రీసెంట్ గా అమ్మడు సినిమాల లిస్ట్ చూస్తే ఇదే అర్థం అవుతుంది. మరి ఈ సారి అనుష్క తన అభిమానులకు ఎలాంటి గిఫ్టులు రెడీ చేస్తుంది అనుకుంటున్నారా?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 11, 2024 / 12:10 PM IST

    .Anushka who says come back.. This time it will not be normal..

    Follow us on

    Anushka :  తెలుగు స్క్రీన్‌ మీద ఏ హీరోయిన్‌ని మీరు ఎక్కువగా మిస్‌ అవుతున్నారు అంటే ఠక్కున అనుష్క పేరు చెబుతారు. బాహుబలి తర్వాత ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో అనుష్క రూలింగ్‌ ఉంటుంది అని చాలా మంది ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ దీనికి పూర్తి విరుద్దంగా జరిగింది. కానీ రీసెంట్‌గా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టితో లక్కీ లేడీ అనిపించుకుంది ఈ బ్యూటీ. అయితే ఆంధ్రా ఒరిస్సా బార్డర్‌లో జరిగే కథగా ఘాటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతుంది. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చేశారు కెప్టెన్‌ క్రిష్‌.

    ఘాటీతో పాటు కథనార్‌ నుంచి కూడా అప్‌డేట్స్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చట. ఈ సినిమాకు సంబంధించిన అప్డేడ్ కూడా రాబోతుంది. ఈ సినిమాలతో పాటు మరో రెండు సినిమాల అనౌన్స్ మెంట్లు కూడా ఉంటాయట. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగింది అనుష్క శెట్టి. ఆ తర్వాత వేగంగా బరువు మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఇండస్ట్రీకి కూడా దాదాపు మూడేళ్ల పాటు దూరంగా ఉంది స్వీటీ. మళ్లీ అను కమ్ బ్యాక్ అన్నట్టుగా బరువు తగ్గింది అనుష్క. మళ్లీ వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది కాబట్టి ఇక అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. గతంలో ప్రభాస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చినా అది ఫేక్ జస్ట్ మేము ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు ఈ రీల్ కపుల్స్.

    అనుష్క కొన్నాళ్ల పాటు సినిమాలు, మీడియాకు దూరంగా ఉంది. ఆమె పెళ్లి చేసుకుందని రూమర్స్ వచ్చాయి కూడా. ఆ ఆరోపణలపై అనుష్క తాజాగా స్పందించింది. ‘‘అందరూ నేను పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. మరి ఎవరిని పెళ్లి చేసుకున్నాను అని తెలియదు. అయినా పెళ్లి అనేది నేరం కాదు కదా? మరి దాయాల్సిన అవసరమేంటి? కనీసం ఇకనైనా ఇలాంటి ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేయడం ఆపండి’ అంటూ స్వీట్ గా హార్డ్ గా స్పందించింది అమ్మడు. తెలుగులో దాదాపు సీనియర్ హీరోలందరితో సినిమాలు చేసింది. తమిళంలోనూ టాప్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, భాగమతి ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఇప్పుడు మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయింది.