భారత రక్షణ దళం రోజురోజుకి మరింత పటిష్టం అవుతున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో అధునాతన ఆయుధాలను తయారు చేస్తూ దేశ రక్షణ రంగం పటిష్టం కావడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. తాజాగా డీఆర్‌డీవో రుపొందించిన సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పెడో ‘(స్మార్ట్)ను ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాలను సరిగ్గా చేధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవోకు అభినందనలు తెలిపారు.