
దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రాణవాయువు అందక పలు చోట్ల రోగులు ప్రాణాుల కోల్పోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆక్సిజన్ అందక దిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది రోగులు చనిపోయారని యాజమాన్యం శనివారం వెల్లడించింది. ఆక్రిజన్ నిల్వలు మరో అరగంట మాత్రమే ఉన్నాయని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డా. డీకే బలూజా పేర్కొన్నారు.