
టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (21) ఔటయ్యాడు. మార్క్ వుడ్ వేసిన 12వ ఓవర్ లో మూడో బంతికి సిక్సర్ బాదిన హిట్ మ్యాన్ తర్వాత ఆరో బంతికి మరో భారీ షాట్ ఆడి మోయిన్ అలీ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా, కెప్టెన్ కోహ్లీ ఉన్నారు. మరోవైపు టీమ్ ఇండియా ఇప్పడు 27 పరుగులు సాధించడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ అధిక్యాన్ని పూర్తిచేసింది.