
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. బ్యాడ్మింటన్ లో సుహాస్ యుతిరాజ్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ ఎస్ ఎల్ 4 విభాగం ఫైనల్స్ లో ప్రాన్స్ షట్లర్ మజుర్ లుకాస్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్ రజతంతో ఇంటికి తిరిగి పయణమయ్యారు. ఈ పతకంతో పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది.