
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సహా, కోల్ కతా నగరంలో పెట్రోల్ లీటర్ రూ. 100 మార్క్ ను దాటింది. చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 35, డీజిల్ పై 17 పైసలు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 100.21కు చేరగా డీజిల్ రూ. 89.53కు చేరింది. ముంబైలో పెట్రోల్ రూ. 106.25, డీజిల్ రూ. 97,09కు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 104,.14, డీజిల్ రూ. 97,.58గా ఉంది.