
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. మంగళవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ లీటర్ కు 28 పైసల వరకు పెంచాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.50, డీజిల్ రూ. 88.23కి పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్ రూ. 103.63కు చేరింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 మార్క్ ను ధాటింది.