
కరోనాతో ప్రముఖ కన్నడ నటుడు శంకనాడ అరవింద్ (70) కన్నుమూశారు. గత వారం రోజులుగా ఆయన బెంగళూరులోని ప్రైవేట్ ఆసుప్రతిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు మ్యూజిక్ డైరెక్టర్ మనసా హోల్లా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అరవింద్ భార్య మరణించింది. ఇప్పుడు అరవింద్ కరోనాతో మరణించాడు. ఇప్పటి వరకు సుమారు 250 సినిమాల్లో నటించిన అరవింద్ సహాయక పాత్రల్లో తనదైన మార్కును చాటుకున్నారు.