
కరోనాతో మా అబ్బాయి అనే సినిమాతో దర్శకుడిగా మారిన కుమార్ వట్టి కన్నుమూశారు. ఆయన మృతికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కుమార్ వట్టి మొదటగా పరుశురాం వద్ద అసిస్టెంట్ గా పని చేశారు. యువత సినిమా కోసం పరుశురాం వద్ద కుమార్ వట్టి పని చేశారు. ఆ తరువాత సోలో సినిమాకు కూడా పనిచేశారు. సోలో సినిమా సమయంలోనే విష్ణుతో పరిచయం ఏర్పడడంతో ఆయనతో కలిసి మా అబ్బాయి అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా కుమార్ వట్టి వయస్సు 39 సంవత్సరాలు.