Air India flight: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఏఐ315 విమానం హాంకాంగ్ నుంచి దిల్లీకి బయలుదేరింది. ఈక్రమంలో మార్గమధ్యలో ఫైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించి తిరిగి వెనక్కి మళ్లించాడు. ఈ విమానం కూడా ఇటీవల అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ రకమే కావడం విశేషం.