
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇప్పటికే నలుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. తాజాగా చిత్రపరిశ్రమలో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సీవీఎల్ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించారు.