Anil Ravipudi Kalyan Ram movie : కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి…ఇక ఆయన ఏది చేసినా కూడా పెను సంచలనంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో ఆయనకు చాలా మంచి గిరాకీ పెరిగింది. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం చిరంజీవితో చేసిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఇప్పుడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఆయన ఒక కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు అనిల్ రావిపూడి సినిమాతో తెచ్చుకోబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
ఇక వరుసగా తన ఖాతాలో పదో విజయాన్ని కూడా అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి అతనితోనే సినిమా చేస్తున్నాడు. ఇక దీనికోసం అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కు ఒక కండిషన్ అయితే పెట్టాడట.
ఈ సినిమా పూర్తి అయ్యేంతవరకు తను వేరే సినిమా ఏది చేయకూడదని ఆరు నెలల వరకు ఈ సినిమా కోసమే తన డేట్స్ మొత్తం కేటాయించాలని చెప్పారట. ఎందుకంటే ఈ సినిమా కోసం తనకు కొత్త మెకోవర్ అయితే ఇవ్వబోతున్నాడట. అలాగే ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. కాబట్టి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. అలాగే తను రాయలసీమ యాస లో మాట్లాడబోతున్నాడట.
ఇక దానికోసం ఆయన స్పెషల్ కేర్ తీసుకొని మరి రాయలసీమ యాస నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే తనకు ఒక ట్రైనర్ ని పెట్టి రాయలసీమ యాసను నేర్పించే పనిలో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడట… ఇక ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధించి కళ్యాణ్ రామ్ మార్కెట్ లోకి రాబోతున్నాడు అనేది చాలా క్లారిటిగా తెలుస్తుంది…
