Anil Ravipudi : టాలీవుడ్ లో రాజమౌళి(SS Rajamouli) తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఏకైక డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi). కెరీర్ లో వరుసగా 8 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. నేడు విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) తో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అంటే ట్రిపుల్ హ్యాట్రిక్ అందుకున్న డైరెక్టర్ అన్నమాట. కమర్షియల్ సినిమా చేస్తే అనిల్ రావిపూడి తో చెయ్యాలి అని ప్రతీ హీరో కోరుకునే రేంజ్ కి ఎదిగిపోయాడు. గత సంక్రాంతికి 300 కోట్ల గ్రాస్ సినిమాని అందుకున్న ఆయన, ఈసారి ఏకంగా 400 కోట్ల గ్రాస్ పై కన్నేశాడు. మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే అనిల్ రావిపూడి కి ఇప్పుడు ఒక విచిత్రమైన సమస్య ఒకటి వచ్చింది
ఈ చిత్ర నిర్మాత సాహు అనిల్ తో ఒక పందెం కట్టాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నార్త్ అమెరికా లో కచ్చితంగా 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుంది చూడు అని సినిమా విడుదలకు నెల రోజుల ముందే చెప్పాడట. అప్పుడు అనిల్ రావిపూడి ‘అబ్బో..నిజమా..? , అదే కనుక జరిగితే నీకు ఒక కారుని గిఫ్ట్ గా ఇస్తా’ అని చెప్పాడట. ఇప్పుడు ఆ చిత్రం 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని, అనిల్ నాకు కారు ఇవ్వాల్సిందే అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. సినిమాని ఇంత సూపర్ హిట్ చేసినందుకు సాధారణంగా నిర్మాతలు దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇస్తుంటారు, కానీ ఇక్కడ రివర్స్ లో జరుగుతుంది అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.
ఇకపోతే నార్త్ అమెరికా లో ఈ చిత్రం అందరి అంచనాలను దాటేసింది. మొదటి రోజు కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చిందని, చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్ గా నిలిచిందని అంటున్నారు. అంటే కాదు, మూడు రోజుల క్రితం విడుదలైన ‘రాజా సాబ్’ కి కూడా ఇంత గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ నుండి రాలేదు. నేటి తరం స్టార్ హీరో కూడా సాధించలేని అరుదైన రికార్డు ని మెగాసార్ చిరంజీవి 70 ఏళ్ళ వయస్సు లో సాధించాడు అంటే సాధారణమైన విషయం కాదు. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.