Anasuya Bharadwaj vs Sivaji Controversy : గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో..,మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో నటుడు శివాజీ హీరోయిన్స్ ధరించి దుస్తుల చేసిన కామెంట్స్, దాని చుట్టూ జరిగిన సంఘటనలు, వివాదాలు మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వ్యవహారం లో సినీ సెలబ్రిటీలు మొత్తం ఒక వైపు, జనాలు మొత్తం మరో వైపు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సినీ సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుండగా, జనాలు మాత్రం శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో సామాన్లు అనే పదం కచ్చితంగా తప్పు పదమే, అందుకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు, కానీ ఆయన మాట్లాడిన ఓవరాల్ స్టేట్మెంట్ లో ఎలాంటి తప్పు లేదంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్. ఇక శివాజీ వ్యాఖ్యలపై మొదటి నుండి పోరాటం చేస్తున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వ్యవహారం వేరే లెవెల్ కి వెళ్ళడానికి కూడా ఒక కారణం ఆమె.
అయితే రీసెంట్ గా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలో ఆమె స్విమ్ సూట్ ని ధరించి షేర్ చేసింది. ఇది శివాజీ కి పరోక్షంగా కౌంటర్ ఇస్తున్నట్టే ఉంది. సోషల్ మీడియా లో ఈ అంశంపై ఇప్పుడు యుద్ధమే నడుస్తుంది. ఇలాంటి సమయం లో ఆమె అలాంటి దుస్తులతో ఫోటోలు పెట్టింది అంటే కచ్చితంగా శివాజీ కౌంటర్ ఇస్తున్నట్టే అని అనుకోవచ్చు. ఈ అంశం పై శివాజీ మాట్లాడడం మానేసాడు, తన సినిమా ప్రొమోషన్స్ ని తానూ చేసుకోవడం లో బిజీ అయ్యాడు. కానీ అనసూయ మాత్రం ఈ అంశాన్ని కొత్త సంవత్సరం లో కూడా వదిలేలా లేదు. పగబట్టిన పాము లాగా శివాజీ ని వెంటాడేలా ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు .
గతం లో ఈమె హీరో విజయ్ దేవరకొండ పై కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చింది. అర్జున్ రెడ్డి లో ఆయన బూతులు మాట్లాడాడు అని, మహిళల పట్ల ఇసుమంత గౌరవం కూడా లేదంటూ సోషల్ మీడియా లో ఎన్నోసార్లు తన ఆవేశాన్ని బయటపెట్టింది. ఈమె మాత్రం జబర్దస్త్ లాంటి బూతు కామెడీ ఉండే షోకి యానకరింగ్ చేస్తూ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పొచ్చు, విజయ్ దేవరకొండ మాత్రం సినిమాల్లో బూతులు మాట్లాడకూడదు, అక్క రూల్స్ మాత్రమే చెప్తుంది , ఫాలో అవ్వదు అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్స్ కి గురైంది. ఇప్పుడు శివాజీ విషయం లో కూడా అదే రేంజ్ ట్రోల్స్ ని ఎదురుకునేలా అనిపిస్తోంది.