Amit Shah: ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూరం ప్రాముఖ్యత ప్రపంచానికి తెలిసింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించి దేశం గర్వపడేలా చేశాం. నరేందరమోదీకి మాత్రమే అది సాధ్యం. మన దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనుకున్నవారిని వెనక్కి పంపేశాం అన్ని తెలిపారు. మోదీ బలమైన రాజకీయ సంకల్పం, నిఘా సంస్థలు అందించిన కచ్చితమైన సమాచారం త్రివిద దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యిందని తెలిపారు.