
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 22కు చేరింది. శుక్రవారం సాయంత్రానికి 15 మంది మృతి చెందగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నానికి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 22కు చేరింది. మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. అలీగఢ్ లోని లోధా, ఖైర్ జవాన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో వివిధ గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 15 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం ఆ జిల్లా అధికారులు ప్రకటించారు.