
నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈనెల 12న నీట్ జరిగి తీరుతుందని స్పష్టం చేసింది. సీబీఎస్సీ కంపార్ట్మెంట్, ప్ర్రైవేట్ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు నీట్ పరీక్షను వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ కు అప్లై చేసుకున్నారని, కొందరి కోసం పరీక్షను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తెలిపింది.