
రెండు రోజుల క్రితం కాస్త తగ్గినట్టే కనిపించిన కరోనా ఇప్పుడు మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,120 మందిని వైరస్ పొట్టనబెట్టుకుంది. ఇక కొత్త కేసులు 4లక్షలకు దిగువనే ఉన్నప్పటికి క్రితం రోజు కంటే స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18.64 లక్షల మంది కరోనా పరీక్షలు చేయించుకోగా 3,62,727 మందికీ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.37 కోట్లకు చేరింది.