
దేశమంతా కరోనా మహమ్మారి వీర విహారం చేస్తుంటే ఈశాన్య రాష్ట్రం మిజోరంను మరో కొత్త వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనే కొత్త వ్యాధితో మిజోరంలో నిత్యం పదుల సంఖ్యలో పందులు మరణిస్తున్నాయి. గత మార్చి 21న తొలి మరణం నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 1728 మందులు చినిపోయాయి. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాకుతూ రాష్ట్రమంతటా చుట్టుకుంటున్నరి. పందుల మరణాల రూపంలో రూ. 6.91 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్టర ఆరోగ్యశాఖ వెల్లడించింది.