
తమిళనాడు ప్రజలపై కొత్త సీఎం ఎంకే స్టాలిన్ వరాల జల్లు కురిపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కీలక ఉత్వర్వులపై సంతకాలు చేశారు. రేషన్ కార్డున్న ప్రతి ఇంటికీ రూ. 4 వే ల కరోనా సాయం ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. తొలి విడత కింద రూ. 2 వేలను ఈ నెలలోనే అందజేస్తారు. మే నెలాఖరు నాటికి అందరికీ కరోనా సాయం అందనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు సీఎం శుభవార్త చెప్పారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.