
తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాలశ్రీ భర్త ప్రముఖ నిర్మాత రాము (52) కరోనాతో కన్నుమూసారు. ఈయన కన్నడలో పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయనకు వారం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో బెంగుళూరులోని ఓ వ్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో కన్నమూసారు.