
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నటుడు సోనూ సూద్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సోనూసూద్ కు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరినీ చల్లగా కాపాడాలని దుర్గమ్మను కోరుకున్నానని సోనూ సూద్ తెలిపారు.