
వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖన మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు. కరోనా కష్ట కాలంలో దవాఖానకువచ్చే రోగులకు ఇబ్బంది రావొద్దని, బాధ్యతగా పనిచేసి కొవిడ్ రోగులకు భరోసాను ఇవ్వాలని వైద్యాధికారులకు సూచించారు. బాధ్యతాయుతంగా పనిచేయని వారి పై చర్యలు తప్పవని వైద్య అధికారులను మంత్రి హెచ్చరించారు.