
సీఎం జగన్ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెనాయుడు విమర్శించారు. టీడీపీ నేత మునెప్ప ఆస్తులు ఆక్రమిచి.. తిరిగి దాడి చేస్తారా అని మండిపడ్డారు. జగన్ పాలనలో అరాచకానికి, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ అని అన్నారు. రోజుకో హత్య, గంటకో విధ్వంసం రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయాయని తెలిపారు. చిత్తూరు జిల్లా రామసముద్రంలో టీడీపీ నేత మునెప్పపై వైసీపీ దాడి హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.