
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సొసైటీ కార్యాలయంలో అధికారులు రికార్డులు పరిశీలించారు. దుకాణాలు కేటాయింపులు, నిధుల విషయంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అనిశా అధికారులు తనిఖీలు చేశారు. సొసైటీ లావాదేవీల వ్యవహారాలపై ఆరా తీశారు. ఆరేళ్లుగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటల రాజేందర్ ఇటీవలే రాజీనామా చేశారు. ఈటల రాజీనామా అనంతరం సొసైటీలో అనిశా తనిఖీలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.