spot_img
Homeఎంటర్టైన్మెంట్Aata winner Pushpa : 'ఆట' టైటిల్ విన్నర్ గా 'పుష్ప'.. క్యాష్ ప్రైజ్...

Aata winner Pushpa : ‘ఆట’ టైటిల్ విన్నర్ గా ‘పుష్ప’.. క్యాష్ ప్రైజ్ విషయంలో టెలివిజన్ హిస్టరీ లోనే సంచలన రికార్డు..

Aata winner Pushpa : గత కొంతకాలం నుండి జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ రియాలిటీ షో ఆట కి ఆడియన్స్ నుండి ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈమధ్య కాలం లో డ్యాన్స్ షోస్ లలో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ‘ఆట’ కే దక్కింది. నిన్న గాక మొన్ననే మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ షో నేటి తో ముగిసింది. గ్రాండ్ ఫినాలే కి పుష్ప , ప్రీతీ పట్నాయక్ , గౌరవ్ మరియు అక్షిత చేరుకున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ని రెండు భాగాలుగా విభజించారు. మొదటి లెవెల్ శనివారం ఎపిసోడ్ లో జరిగింది. ఈ ఎపిసోడ్ లో అక్షిత ఎలిమినేట్ అవ్వగా, పుష్ప , గౌరవ్ , ప్రీతీ పట్నాయక్ టాప్ 3 కంటెస్టెంట్స్ గా గ్రాండ్ ఫినాలే రెండవ లెవెల్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

హోరాహోరీగా జరిగిన ఈ చివరి పోరులోని ప్రీతి పట్నాయక్ ఎలిమినేట్ అవ్వగా , ఇక గౌరవ్, పుష్ప మిగిలారు. వీళ్లిద్దరి మధ్య జరిగిన భీకర పోరులో పుష్ప అత్యధిక మారుకులను సంపాదించి ‘ఆట’ టైటిల్ ని గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఆయన ఏకంగా 88 లక్షల 80 వేల ప్రైజ్ మనీ ని కూడా గెలుచుకోవడం గమనార్హం. అంటే కోటి రూపాయలకు కేవలం 11 లక్షల 20 వేలు రూపాయిలు మాత్రమే తక్కువ అన్నమాట. ఇప్పటి వరకు టెలివిజన్ హిస్టరీ లో ఏ రియాలిటీ షో కూడా ఈ రేంజ్ ప్రైజ్ మనీ ని ఇవ్వలేదు. నెలల తరబడి ప్రసారమయ్యే బిగ్ బాస్ లాంటి బిగ్గెస్ట్ రియాలిటీ షో లో కూడా కేవలం 50 లక్షల రూపాయిలు మాత్రమే ఇచ్చారు. అలాంటిది కేవలం 40 ఎపిసోడ్స్ ని మాత్రమే జరుపుకున్న ఒక డ్యాన్స్ షోకి ఈ రేంజ్ ప్రైజ్ మనీ ఇచ్చినందుకు నిజంగా నిర్మాత నిహారిక కి సెల్యూట్ చేయొచ్చు.

పుష్ప అనే అబ్బాయి , ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతనికి ఈ 88 లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ అంటే చాలా ఎక్కువ , జీవితం లో స్థిరపడినట్టే. ఇక బ్యాంక్ లో ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తే లెక్కలేనంత డబ్బు వస్తుంది , జీవితానికి సరిపడా బ్రతికేయొచ్చు అన్నమాట. సెలబ్రిటీలను షోస్ లోకి తీసుకొచ్చి, వాళ్లకు లక్షల కొద్దీ ప్రైజ్ మనీ ఇచ్చే బదులు , ఇలాంటి సామాన్యుల టాలెంట్ ని గుర్తించి ఈ స్థాయి ప్రైజ్ మనీ ని ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇకపోతే పుష్ప కి కొరియోగ్రాఫర్ గా ఢీ ఫేమ్ కన్నా మాస్టర్ వ్యవహరించాడు. అతనికి కూడా ఈ షో ద్వారా మంచి ఫేమ్ దక్కింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version