Crime News: ప్రేమోన్మాదం పెరిగిపోతోంది. ప్రాణాల మీదకు వస్తోంది. ఎదుటివారిని గాయపరచాలనే ఉద్దేశంతో ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తమకు దక్కనిది వేరే వారికి దక్కకూడదనే అక్కసుతో యాసిడ్ దాడి చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కోయంబత్తూరులో చోటు చేసుకున్న ఘటన చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలపై దాడులు చేయడం సహజమే. కానీ అమ్మాయిలే అబ్బాలపై దాడులకు తెగబడటం సంచలనం సృష్టిస్తోంది.

ప్రేమ ఎక్కువైనా కష్టమే. తక్కువైనా తట్టుకోలేరు. తాము ప్రేమించిన వారైనా సరే వారిని ఎలాగైనా కోలుకోకుండా చేయాలన్నదే తపన. ఈ నేపథ్యంలో వారిపై యాసిడ్ తో దాడులు చేసేందుకు, అన్నంలో పురుగుల మందు కలిపేందుకు కూడా వెనకాడరు. స్వార్థపూరిత ప్రేమలు ఎక్కడికి దారి తీస్తాయో చెప్పాల్సిన అవసరం లేదు. వారి భవిష్యత్ అంధకారమే. చివరికి కటకటాల పాలు కావడమే తప్ప మంచి మార్గం కాదు. కానీ ఎందుకో ప్రేమించిన వారిని సైతం చంపేందుకు కూడా సాహసం చేయడం గమనార్హం.
Also Read: అనారోగ్యంతో అనసూయ తండ్రి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న అనసూయ!
కోయంబత్తూర్ కు చెందిన జయంతి (27), కేరళకు చెందిన రాకేష్ (30) కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మనసులు ఒకటి కావడంతో ఇద్దరి శరీరాలు ఒక్కటయ్యాయి. ఇద్దరు కలిసి కొద్ది రోజులు కలిసి ఉన్నారు. ఏమైందో ఏమో కానీ రాకేష్ జయంతిని దూరం పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె రాకేష్ ను నిలదీసింది. ఎందుకు దూరంగా ఉంటున్నావని ప్రశ్నించింది. దీనికి అతడు తనకు పెళ్లయిందని చెప్పాడు. ఇక సహజీవనం చేయడం కుదరదని తెగేసి చెప్పాడు.
దీంతో కలత చెందిన జయంతి తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదనే ఉద్దేశంతో అతడిపై యాసిడ్ దాడి చేసేందుకు ప్రణాళిక రచించింది. ఓ ముహూర్తం చూసుకుని అతడిపై యాసిడ్ పోసింది. దీంతో అతడు గాయాలపాలయ్యాడు. ఆమె కూడా నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వామ్మో.. ఆ పని కోసం 11 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ.. ఇదేం వ్యసనం రా బాబు