
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంది. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి ఈటల హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులో ఆయన కొడుకు, కోడలు రిసీవ్ చేసుకున్నారు. నిన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈటలతో పాటు రమేశ్ రాథోడ్, రవీందర్ రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తులు ఉమ బీజేపీలో చేరారు.