
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిక్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోదరుడి మరణ వార్తను విని తట్టుకోలేక దేవిశ్రీప్రసాద్ మేనత్త సీతామహాలక్ష్మీ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో వరుస మరణాలతో దేవిశ్రీప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.