నేపాల్ లో వరుసగా భూకంపనలు సంభవిస్తున్నాయి. బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండుకు తూర్పు ఈశాన్య దిశలో ప్రకంపనలు చోటు చేసుకోగా రాత్రి 10 గంటల తరువాత వాయువ్య ప్రాంతానికి 94 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 4.4 గా నమోదైందని భారత భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. భూ ప్రకంపన కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. వరుస భూ ప్రకంపనలతో రాజధాని పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.