
ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రక్రియ ఉంటుందన్నారు. ముందుగానే ఇరుపక్షాలతో చర్చిస్తామని, వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తేల్చి చెప్పారు. అనర్హత పిటిషన్ పరిశీలన తర్వాతే సభాహక్కుల కమిటీకి పంపిస్తామన్న ఆయన సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని వ్యాఖ్యనించారు.