
అమెరికాలోని బార్కేలి నగరంలోని ఓ వీధికి భారతదేశానికి చెందిన “కళా బగాయ్” అనే మహిళా పేరు పెట్టి ఆమెను గౌరవించారు. 1915వ సంవత్సరంలో ఎన్నో ఆశలతో అమెరికాలోకి అడుగు పెట్టిన కళా బగాయ్ జాతి వివక్షకు గురైనది. ఓ అమెరికన్ కుటుంభం ఆమె ఉండడానికి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వలేదు. తర్వాత ఎలాగోలాగ అక్కడే స్థిరపడ్డ ఆమె ఇంగ్లీష్ నేర్చుకున్నారు. భారత్ నుండి అమెరికా వచ్చే వారికి సాయం చేస్తూ వారికి వున్న హక్కులను గురించి తెలియజేసేవారు.