
కొంత మంది మహిళలు ఒకే కాన్పులో కవల పిల్లలకు జన్మనివ్వడం చూశాం. ఇంకొంత మంది మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం చూశాం. కానీ ఈ 25 ఏండ్ల మహిళ మాత్రం ఏకంగా ఒకే ఒకే కాన్పులో 9 మందికి జన్మనివ్వడంతో అందరూ షాక్ అయ్యారు. పశ్చిమాఫ్రికాలో మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే (25) 9 నెలల క్రితం గర్భం దాల్చింది. ఈ క్రమంలో నెలలు నిండుతున్న కొద్ది ఆమెకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ పరీక్షల్లో ఆమె కడుపులో ఏడుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెరగైన వైద్యం కోసం ఆమెను మార్చి నెలలో మాలీలోని మోరాకోకు తరలించారు.