https://oktelugu.com/

Cat : పిల్లే కదా అని.. చులకన వద్దు.. దాని సంపద ఏకంగా 840 కోట్లు..

సాధారణంగా మన ఇళ్లల్లో నాటు పిల్లులు ఉంటాయి. పెరుగుతో అన్నం కలిపి పెడితే తింటాయి. ఇంట్లో ఎలుకలు లేదా ఇతర కీటకాలు ఉంటే చంపి తింటాయి. వాటి పని అంతవరకే. పైగా విదేశీయులు లాగా మనం పెద్దగా పిల్లులను మచ్చిక చేసుకోము.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 19, 2024 / 06:01 AM IST

    World Richest Cat

    Follow us on

    Cat : అయితే మీరు చదవబోయే ఈ కథనంలో ఓ పిల్లి ఏకంగా ఒక మిలియనీయర్. దాని సంపద అక్షరాల 840 కోట్లు. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.. ఆ పిల్లికి ఏకంగా ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. ఈ పిల్లిని పెంచుతున్నవారు నల్ల క్యాట్ పేరు మీద ఇన్ స్టా గ్రామ్ లో పేజీ నడిపిస్తున్నారు . ఈ పిల్లి చూడ్డానికి పులి పిల్ల లాగా కనిపిస్తుంది. దాని మెడలో నీలం రంగు టై ఉంటుంది. ఈ పిల్లి చేసే సరదా సరదా చేష్టలు ఆసక్తికరంగా ఉంటాయి. తన యజమానిని ఆటపట్టించడంలో ఈ పిల్లి మహానేర్పరి. దొంగ చాటుగా పాలు తాగుతుంది. దొంగ చాటుగా ఆహారం తింటుంది. యజమాని కళ్ళు కప్పి లాన్ లో తిరుగుతుంది. అప్పుడప్పుడు ఈత కూడా కొడుతుంది. అయితే ఈ పిల్లి చేస్తున్న సరదా పనులను దాని యజమాని రహస్యంగా వీడియో తీస్తుంటాడు. వాటిని ఈ పిల్లి పేరుమీద ఏర్పాటుచేసిన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ దృశ్యాలు సరదాగా ఉండడంతో నెటిజన్లు ఆసక్తికరంగా చూస్తుంటారు. అవే ఆ పిల్లిని మిలియనీర్ చేశాయి.

    జంతువులన్నింటిలో

    జంతువులన్నింటిలో ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన పిల్లిగా నల్ల క్యాట్ నిలిచింది. వాస్తవానికి ఈ పిల్లి సాధారణ రంగులోనే ఉన్నప్పటికీ.. దాని యజమాని దీని పేరు మీద ఇన్ స్టా ఎకౌంటు ను నల్ల పిల్లి అని ఏర్పాటు చేయడం విశేషం.. యూ ట్యూబ్ లోనూ ఈ పిల్లి వీడియోలను దాని యజమాని పోస్ట్ చేస్తూ ఉంటాడు.ఆ పిల్లి చేసే చేష్టలు విచిత్రంగా ఉంటాయి. అందువల్లే దాని యజమాని భారీగా సంపాదిస్తున్నాడు. ఏకంగా 840 కోట్లు ఆ పిల్లి సంపదగా సమకూరిందంటే మామూలు విషయం కాదు. పైగా ఈ భూమి మీద ఉన్న జంతువులలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న పిల్లిగా నల్ల క్యాట్ నిలిచింది.. దాని ఆహార శైలి కూడా విభిన్నంగా ఉంటుంది. గుడ్డు నుంచి మొదలుపెడితే పాలవరకు దేనిని వదిలిపెట్టదు. అలాగని ఇష్టానుసారంగా తినదు. మితంగానే తింటుంది. అందులోనూ కాస్త పద్ధతి పాటిస్తుంది. అదే నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది.. అన్నట్టు బ్లాక్ క్యాట్ ద్వారా దాని యజమాని భారీగా సంపాదించాడు. ఏకంగా భారీ భవనాలను కొనుగోలు చేసి.. ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో స్థిరత్వాన్ని సంపాదించాడు. ” బ్లాక్ క్యాట్ బాగుంటుంది.. అది చేసే అల్లరి ఇంకా బాగుంటుంది. ఆ అల్లరి నాకు మాత్రమే కాదు మిగతా వాళ్లకు కూడా నచ్చింది. అందువల్లే అది ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంది. డబ్బు సంపాదన పక్కన పెడితే.. అది ఎంతో అందమైన జంతువు. నాకు ఒక రకమైన స్ట్రెస్ బస్టర్. మా పిల్లలకు చాలా ఇష్టమైన పెట్” అని బ్లాక్ క్యాట్ యజమాని వ్యాఖ్యానిస్తున్నాడు.