
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,08,602 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా 8,126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 38 మంది చనిపోగా 3,307 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 62,929 కి చేరింది.