
కరోనా మహమ్మారి కారణంగా మన దేశంలోని మరణాల్లో 70 శాతానికి పైగా ఆరు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఇటీవల పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం దేశవ్యాప్తంగా 3,207 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,35,102 మంది కరోనాతో చనిపోయారు.