దాదాపు నాలుగు వేల కొవిడ్ కేర్ కోచ్ ల్లో 64 వేల పడకలు అదుబాటులోకి తెచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించగా వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. రాష్ట్రాల డిమాండ్ మేరకు ఇండోర్ సమీపంలోని నాగ్ పూర్, బోపాల్, తిహి కోసం కొవిడ్ కేర్ కోచ్ లను రైల్వే సమీకరించింది. నాగ్ పూర్ డివిజన్ రైల్వే మేనేజర్, నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల మధ్య 11 కొవిడ్ కేర్ కోచ్ ల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.