CM Chandrababu AI Startups: భారతదేశ ఏఐ విప్లవానికి నాయకత్వ వహించేందుకు ఏపీ స్వాగతం పలుకుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. బలమైన ఏఐ వ్యవస్థ నిర్మాణానికి లోకేశ్ నాయకత్వంలో ఎన్విడియాతో ఒప్పందం కుదర్చుకున్నాం. దాని మద్దతుతో రాబోయే రెండేళ్ల లో 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. ఏపీ నుంచి 500 ఏఐ స్టార్టప్ లు ప్రారంభం కానున్నాయని అన్నారు. విద్య, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణ వరకు ఏపీ పునాది వేస్తోందని అన్నారు.