
తెలంగాణలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ చెప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరనా వేళ స్టాఫ్ నర్సులను దేవుళ్లని పొగిడారు. ప్రస్తుతం నర్సులు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉన్న ఫళంగా 1,640 కుటుంబాలను కసీఆర్ రోడ్డున పడేశారు అని విమర్శించారు.