ప్రజలకు హెచ్చరిక: టపాసులు పేల్చితే లక్ష జరిమానా

దేశ ప్రజలకు ఒక హెచ్చరిక. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. వేడుకలు, సమావేశాలు, పెళ్లిళ్లలో నిబంధనలు ఉల్లంఘించి శబ్ధకాలుష్యానికి పాల్పడితే రూ. లక్ష వరకు జరిమానా విధించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శబ్ధ కాలుష్యానికి జరిమానా మొత్తాలను భారీగా పెంచి దేశ ప్రజలందరికీ షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ ఒకటి. ఢిల్లీలో ఇప్పటికే పొగమంచు వల్ల శీతాకాలంలో […]

Written By: NARESH, Updated On : July 10, 2021 2:00 pm
Follow us on

దేశ ప్రజలకు ఒక హెచ్చరిక. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. వేడుకలు, సమావేశాలు, పెళ్లిళ్లలో నిబంధనలు ఉల్లంఘించి శబ్ధకాలుష్యానికి పాల్పడితే రూ. లక్ష వరకు జరిమానా విధించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శబ్ధ కాలుష్యానికి జరిమానా మొత్తాలను భారీగా పెంచి దేశ ప్రజలందరికీ షాక్ ఇచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కారక నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ ఒకటి. ఢిల్లీలో ఇప్పటికే పొగమంచు వల్ల శీతాకాలంలో కొద్దిరోజులు సెలవులు ఇస్తారు. రహదారులను మూసేస్తారు. కాలుష్యం పెరిగిపోయి ప్రభుత్వం రోడ్లపైకి వాహనాలను నిషేధించి సరి, బేసీ విధానంలో అమలు చేస్తోంది. కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఢిల్లీలో ఇప్పుడు కాలుష్యాన్ని తగ్గించడానికి కాలుష్య నియంత్రణ కమిటీ రంగంలోకి దిగింది.

ఇకపై ఢిల్లీలో వేడుకలు, సమావేశాలు వంటి కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా టపాకాయలు కాల్చిన , భారీ శబ్ధ కాలుష్యానికి పాల్పడినా.. డీజేలు, చప్పుళ్ల వంటి సౌండులు చేసినా వారి బాక్సులు పగిలిపోతాయి. అటువంటి వారికి రూ..లక్షల జరిమానా విధించనున్నట్లు కాలుష్య నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. పండుగ సమయాల్లో నివాస, వాణిజ్య సముదాయాల్లో నిర్ణీత గడువు తర్వాత కూడా టపాసులు పేల్చేవారికి రూ.1000 జరిమానా విధించనున్నారు. అదే సైలెంట్ జోన్లలో ఈ జరిమానా రూ.3000గా ఉంది. ఇక నివాస సముదాయాల్లో పెళ్లి వేడుకలు, పబ్లిక్ ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాల్లో బాణాసంచా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేల జరిమానా చెల్లించారు.

ఇక సైలెంట్ జోన్లలో ఈ జరిమానా ఏకంగా రూ.20వేలుగా ఉంది. రెండోసారి ఉల్లంఘిస్తే రూ.40వేలు, అంతకంటే ఎక్కువ సార్లు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని అధికారులు సంచలన నిర్ణయాన్ని వెలువరించారు.జనరేటర్ సెట్ల వల్ల కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. వాటికి లక్ష జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. దీంతో ప్రజలంతా కూడా ఇక నుంచి శబ్ధి కాలుష్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే భారీ జరిమానా ఎదుర్కోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.