
కరోనా పై పోరుకు రక్షణరంగ సాంకేతికతతో 2డీజీ ఔషధం అభివృద్ది, ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్ డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. 2డీజీ ఔషధం పై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మధ్యస్త, తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా రోగులపై ప్రభావవంతంగా 2 డీజీ ఔషధం పనిచేస్తుందని, ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గిస్తుందని సతీష్ రెడ్డి వివరించారు.