ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు

ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. చికిత్స కోసం ఇంజక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలకు 3 వేల డోసలు ఇంజక్షన్లు పంపామని చెప్పారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ మరణాలపై ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ డెసివర్ కొరత లేదని తెలిపారు. ఆనందయ్య మందుపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని సింఘాల్ అన్నారు. ప్రయోగశాలలకు పంపిన నమూలనాల నివేదికలు త్వరలోనే […]

Written By: Velishala Suresh, Updated On : May 25, 2021 9:03 pm
Follow us on

ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. చికిత్స కోసం ఇంజక్షన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలకు 3 వేల డోసలు ఇంజక్షన్లు పంపామని చెప్పారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ మరణాలపై ఇప్పటి వరకు సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ డెసివర్ కొరత లేదని తెలిపారు. ఆనందయ్య మందుపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని సింఘాల్ అన్నారు. ప్రయోగశాలలకు పంపిన నమూలనాల నివేదికలు త్వరలోనే వస్తాయని, ఆ తర్వాత మందు పంపిణీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.