
త్రిపురలోని అంబస్సా వద్ద ఉన్న తాత్కాలిక కొవిడ్ సంరక్షణ కేంద్రం నుంచి 25 మంది రోగులు తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో ఏడుగురిని రైల్వే స్టేషన్ వద్ద పట్టుకున్నారు. పంచాయతీ రాజ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లోని కొవిడ్ కేర్ సెంటర్ నుంచి పారిపోయిన రోగులందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు అని అంబస్సా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి హిమాద్రి సర్కార్ పేర్కొన్నారు.